Wednesday, 22 April 2026 05:01:47 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శ్రీరాముడి జీవితం ఆచరణీయం: గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 17 April 2024 08:09 PM Views : 943

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ హైట్స్, నవోదయ కాలని, నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంగాధర్ రెడ్డికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ఆచరణీయమని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించిన అవతారమే శ్రీరామచంద్రుడి అవతారం అని అన్నారు.

Also Read : ఐటీ కారిడార్.. అర్థరాత్రి.. మద్యం మత్తులో కారుతో ఐటీ ఉద్యోగి..

శ్రీరాముడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. శ్రీరామనవమి ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. రాముడు చూపించిన ధర్మమార్గం వైపు మనల్ని నడిపిస్తూ కుటుంబం, సమాజం, దేశం పట్ల మన కర్తవ్యాలను, బాధ్యతలను గుర్తు చేసే ఉత్సవం శ్రీరామ నవమి అని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ హిట్స్ కాలనీ వాసులు,నవోదయ కాలనీ వాసులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :