Wednesday, 29 July 2026 06:13:13 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

దివంగత కొండకల్ శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

శేరిలింగంపల్లి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కొండకల్ :కొమిరిశెట్టి సాయిబాబా

Date : 10 May 2024 12:17 AM Views : 3828

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ ఉద్యమకారుడు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడు దివంగత కొండకల్ శంకర్ గౌడ్ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘనంగా నివాళులు అర్పించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండకల్ శంకర్ గౌడ్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ తో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకున్న సాయిబాబా, తాను కొండకల్ శంకర్ గౌడ్ ను రాజకీయ గురువుగా బావిస్తానని అన్నారు. తనలాంటి ఎందరికో రాజకీయ అవకాశం కల్పించిన ఘనత శంకర్ గౌడ్ దని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి కొండకల్ శంకర్ గౌడ్ అని తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి, తనవంటి ఎందరినో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం శంకర్ గౌడ్ వేసిన పునాది అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల గుండెల్లో కొండకల్ శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలిచి పోతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొండకల్ శంకర్ గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని శేరిలింగంపల్లి పరిధిలో పార్టీ పటిష్టతను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొండకల్ శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన వారిలో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: