Sunday, 01 March 2026 11:22:23 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ రచ్చకు కారణమైన కాంగ్రెస్ నిర్ణయం

Date : 06 February 2026 12:35 AM Views : 93

Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వేడికి కారణమైంది. మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో ఈ మధ్యే తెలంగాణ స్పీకర్ క్లిన్ చీట్ ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించిన వారి పేర్లు ఉండడం సంచలనం గా మారింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 28 మందితో గురువారం సాయంత్రం కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని నియమిస్తూ టీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం అటు తెలంగాణ రాజకీయాల్లో, ఇటు శేరిలింగంపల్లి లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గా గెలుపొందిన అరెకపూడి గాంధీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్పీకర్ కు పిర్యాదు చేసింది.

స్పీకర్ నిర్ణయం తీసుకోక పోవడంతో గులాబీ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ మధ్యే నిర్ణయం తీసుకున్నారు. అరెకపూడి గాంధీ పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఎమ్మెల్యే గాంధీకి క్లీన్ చీట్ ఇచ్చారు. కాగా తాజాగా గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కోఆర్డినేటర్ల జాబితాలో అరెకపూడి గాంధీ పేరు ఉండడం సంచలనంగా మారింది. తెలంగాణ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గుర్తించిన అరెకపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల కోఆర్డినేటర్ గా ప్రకటించడం అటు రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు శేరిలింగంపల్లి లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. దీన్ని ఆధారంగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు గుప్పించడం తో పాటు గాంధీ అనర్హత కోసం మరోసారి కోర్టును ఆశ్రయిస్తారనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే గాంధీ తో పాటు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లుగా తేల్చిన తెల్లం వెంకట్ రావు, ప్రకాష్ గౌడ్ పేర్లు సైతం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ల జాబితాలో ఉండడం విశేషం.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :