Monday, 14 September 2026 12:07:56 AM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

తన చివరి క్షణం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహానీయుడు జయశంకర్ : కొమిరిశెట్టి సాయిబాబా

Date : 21 June 2024 08:47 PM Views : 1028

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తన జీవితంలో చివరి క్షణం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ కార్పొరేటర్ సాయిబాబా నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం పరితపించిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు.

Also Read : రహదారుల మీద బైక్ రేసింగ్ లకు పాల్పడితే జైలుకే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రపంచం ముందు వినిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. నేటి యువత ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ అభివృద్ధికి, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు పాటుపడాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో, ఆయన చూపిన బాటలో ఉద్యమం నడిపించిన కెసిఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ ను చిరకాలం గుర్తుంచుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సతీష్ ముదిరాజ్, నారాయణ, రమేష్ గౌడ్, తాహేర్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: