Wednesday, 29 July 2026 07:18:17 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

డాక్టర్స్ కాలనీకి లక్ష రూపాయలు అందజేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ అభివృద్దే లక్ష్యం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 14 March 2024 08:46 PM Views : 897

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన గచ్చిబౌలి డివిజన్ ప్రజల ఋణం తీర్చుకుంటానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో పలు అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన సొంత డబ్బు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు గోపన్ పల్లి కార్యాలయంలో గురువారం డాక్టర్స్ కాలనీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డికి అందజేశాడు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని సదుపాయాలను ఉపయోగించుకుంటానని అన్నారు.

Also Read : ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం, తనకు చేతనైనంత మేర స్వంత నిధులతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపడుతామని అన్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, తనపై నమ్మకం ఉంచి, కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన డివిజన్ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనే గచ్చిబౌలిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సంయుక్త కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: