Thursday, 15 January 2026 07:14:01 AM
# శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్ # కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు # అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం # తాళం పగులగొట్టే పనిలేదు.. డిజిటల్ స్క్రీన్ ల మీదే సర్వం లూఠీ

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు

ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం

Date : 24 December 2025 09:35 AM Views : 144

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ లో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఓ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వద్ద 250 కోట్ల విలువైన ఆస్తులు బయటపడడం ఈ శాఖలో అవినీతి ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో కళ్లకు కడుతుంది. హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఎం.కిషన్ నాయక్ మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ లు చేశారు.

Also Read : ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్

ఇతనికి నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో 1.37 కోట్ల రూపాయల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. కిషన్ నాయక్ తో పాటు ఆయన బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకోగా.. బహిరంగ మార్కెట్ లో వాటి విలువ రూ.250 కోట్లు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :