Saturday, 18 April 2026 07:10:15 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Date : 15 March 2024 06:23 PM Views : 965

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది.శుక్రవారం ఈడి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించింది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Also Read : గంజాయి లేడీ డాన్ నీతుబాయ్ అరెస్టు

మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ కీలకంగా మారనుంది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :