Saturday, 18 April 2026 07:08:51 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గంజాయి లేడీ డాన్ నీతుబాయ్ అరెస్టు

22 కిలోల గంజాయి, రూ.22 లక్షల నగదు స్వాధీనం

Date : 14 March 2024 09:38 PM Views : 868

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నగరంలో గంజాయి వ్యాపారంలో లేడీ డాన్ గా పేరుగాంచిన నీతూ భాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో 18 కేసుల్లో నిందితురాలిగా ఉన్న నానక్ రాంగూడకు చెందిన నీతూ భాయ్ మీద పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. భర్త, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఐటీ కారిడార్ లో గంజాయి వ్యాపారం చేసి భారీగా లాభాలు ఆర్జించిన నీతూ భాయ్ వచ్చిన లాభాలతో కోట్లలో ఆస్థులు కూడబెట్టింది. చివరిసారిగా పోలీసులకు చిక్కిన సమయంలో నీతూ భాయ్ 16 బ్యాంకు అకౌంట్లలోని 1.50కోట్లను ఫ్రీజ్ చేశారు. గంజాయి వ్యాపారంలో వచ్చిన లాభాలతో కూడబెట్టిన 4కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. కొన్నిరోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన నీతూ భాయ్ తిరిగి గంజాయి వ్యాపారం ప్రారంభించింది. ఓ కేసు విచారణలో సిద్దిపేట పోలీసులకు నీతూ భాయ్ గంజాయి వ్యాపారం గుట్టు తెలియడంతో సిద్దిపేట, గచ్చిబౌలి పోలీసులు, టిఎస్ నాబ్ అధికారులు కలిసి నానక్ రాంగూడలోని నీతూ భాయ్ ఇంటి మీద బుధవారం రాత్రి దాడి చేశారు.

Also Read : డాక్టర్స్ కాలనీకి లక్ష రూపాయలు అందజేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ దాడిలో గంజాయి అమ్ముతున్న నీతూ భాయ్, ఆమె భర్త మున్ను సింగ్, బంధువులు సురేఖ, మమతలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయి, 22లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రాంగూడలో కిరాణా షాప్, హోటల్ ముసుగులో స్థానిక యువతకు, ఐటీ ఉద్యోగులకు నీతూ భాయ్ గంజాయి విక్రయిస్తుండగా, పోలీసులు దాడి చేసిన సమయంలో నీతూ ఇంటి వద్ద గంజాయి తాగుతున్న 13మందిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గంజాయిని దూల్ పేటలో అంగురీ భాయ్ వద్ద కిలో 8వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు నీతూ భాయ్ తెలిపింది. గంజాయి ని 5గ్రాములకు ప్యాకెట్ చొప్పున తయారు చేసి, ఒక్కో ప్యాకెట్ 500 రూపాయలకు విక్రయిస్తుంది. ఒక్కో కిలో మీద 50వేల లాభాన్ని ఆర్జిస్తున్న నీతూ భాయ్ లగ్జరీగా జీవిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆమె వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లు ఒక్కోటి లక్ష రూపాయల పైచిలుకు ధర ఉండడం విశేషం.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :