Sunday, 13 September 2026 10:51:52 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తక్కువ ధరకు బంగారమంటూ తోటి ఉద్యోగులకు టోకరా ఇచ్చిన ఐటీ ఉద్యోగి

13 మంది బాధితుల నుండి రూ.6.12 కోట్లు వసూళ్లు

Date : 20 April 2024 09:22 PM Views : 1027

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తోటి ఉద్యోగులను నిలువునా ముంచాడు. మొత్తం 13 మంది బాధితుల నుంచి 6కోట్ల పైచీలుకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్ (40) కొండాపూర్ మజీద్ బాండలో నివాసం ఉంటూ మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తాను మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు బంగారం సరఫరా చేస్తానంటూ తనతోటి ఉద్యోగులు, వారి బంధువులను నమ్మించాడు.

Also Read : శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

100 నుండి 200 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే గ్రాముకు 5950 రూపాయలు, 300 నుండి 500 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే గ్రాముకు 5850 రూపాయల తక్కువకు బంగారం సరఫరా చేస్తానని నమ్మించాడు. అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఓ రేటు, నగదు ఇస్తే మరో రేటు అని చెప్పాడు.  డబ్బులు చెల్లించిన వారికి 25 రోజుల్లో బంగారం అందజేస్తామని నమ్మించాడు. శ్రీధర్ మాటలు నమ్మిన అతనితో పాటు పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అత్యాశకు పోయి ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 13 మంది వద్ద నుంచి 6.12 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సు వింగ్ పోలీసులు నిందితుడు శ్రీధర్ ను అరెస్టు చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: