Wednesday, 22 April 2026 07:17:26 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

వెసెల్లా వుడ్స్​ విల్లాస్​లో చోరికి ప్రయత్నించిన దొంగల ముఠా

సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డు

Date : 11 February 2025 10:55 PM Views : 936

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఈ-కబురు, శేరిలింగంపల్లి : ఐటీ కారిడార్​లో ఓ గేటెడ్​ కమ్యూనిటీ విల్లాస్​లోకి చొరబడ్డ నలుగురు దొంగలు విల్లాస్​లో చోరి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లో చోటుచేసుకుంది. కొండాపూర్​ వెసెల్లా వుడ్స్​ గేటెడ్​ కమ్యూనిటీలో 82 విల్లాస్​ ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.17 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు గేటెడ్​ కమ్యూనిటీలోకి ప్రవేశించారు. విల్లాస్​ డోర్​ బ్రేక్​ చేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. నడుస్తున్న శబ్దాలు వినిపించకుండా తమ చెప్పులు చేతుల్లో పట్టుకొని, ముఖానికి మాస్కులు ధరించి విల్లాల ముందు తిరిగారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయారు.

Also Read : గచ్చిబౌలి నిథిమ్ లో చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణం కూల్చివేత

ఈ సంఘటన మొత్తం విల్లాస్​ ముందు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే గేటెడ్​ కమ్యూనిటీ... పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్న కూడా దొంగలు విల్లాస్​లోకి ప్రవేశించి దర్జాగా తిరగడంపై విల్లాస్​ యజమానులు కమ్యూనిటీ మేనేజ్మెంట్​పై అగ్రహం వ్యక్తం చేశారు. వేలకు వేలు మెయింటెనెన్స్​ తీసుకుంటూ సరైన భద్రత కల్పించడంలో  విల్లాస్​ మేనేజ్​మెంట్​ విఫలమయ్యిందని ఆరోపించారు. వెసెల్లా వుడ్స్​ విల్లాస్​లో చోరియత్నంపై ఏలాంటి ఫిర్యాదు రాలేదని మియాపూర్ పోలీసులు తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :