Sunday, 13 September 2026 10:17:02 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

పట్టినాగులపల్లిలో పేయింటింగ్ కాంట్రాక్టర్ దారుణ హత్య

హత్య చేసిన తోటి పెయింటింగ్ కూలీలు

Date : 25 July 2024 12:49 AM Views : 1047

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : వట్టినాగులపల్లిలో ఓ పేయింటింగ్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. పేయింటింగ్ కూలీలతో డబ్బుల విషయంలో జరిగిన గోడవలే హత్యకు దారితీశాయి. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వలస వచ్చిన రాజ్ కుమార్ వట్టినాగులపల్లిలో నివాసం ఉంటూ పెయింటింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. తనతో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి ఆరుగురు వ్యక్తులన తీసుకువచ్చి పెయింటింగ్ కూలీలుగా తనవద్ద పనికి పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా రాజ్ కుమార్ కూలీలకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాజ్ కుమార్ కూలీలతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో కూలీలతో రాజ్ కుమార్ కు గొడవ జరిగింది. అనంతరం కూలీలు తమ గదిలో, రాజ్ కుమార్ వరండాలో నిద్రపోయారు. అర్థరాత్రి కూలీలలో ఒకరైన రాంసింగ్ ఇనుప సుత్తితో రాజ్ కుమార్ తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఇంటి యజమాని సమాచారం తో పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: