Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి ఓ డెలివరీ బాయ్ మృతిచెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... నారాయణపేటకు చెందిన ఎరుకల ఆంజనేయులు(26) నగరంలోని లంగర్ హౌజ్ లో నివాసం ఉంటూ జెప్టోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఆంజనేయులు గచ్చిబౌలి నుంచి మోహదీపట్నం వైపు ద్విచక్రవాహనం మీద వెళ్తున్నాడు. మార్గమధ్యలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో ఆంజనేయులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి వెనుక నుంచి ఆక్సిజన్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం బేగంపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందా లేక ఆంజనేయులు ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఎమ్మెల్యే గాంధీని కలిసిన సాయిరాం కాలనీ వాసులు
Admin
Ekaburu