Sunday, 13 September 2026 10:52:39 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

అధికారుల అండదండలా.. అక్రమార్కుల బరితెగింపా

సిద్దిక్ నగర్ ప్రభుత్వ స్థలంలో మరోసారి నిర్మాణ పనులు

Date : 02 August 2025 08:32 PM Views : 490

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఏడాది క్రితం కబ్జాకు యత్నం. - ప్రభుత్వ భూమిని సూచిస్తూ బోర్డులు పాతిన రెవెన్యూ అధికారులు... నాలుగు నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభం -  పనులను అడ్డుకున్న మండల కార్యాలయం.. తాజాగా రెండు రోజులగా అదే స్థలంలో జోరందుకున్న నిర్మాణ పనులు - ఈ దఫా కార్యాలయం దాటని రెవెన్యూ సిబ్బంది... ఇది సిద్దిక్ నగర్ లోని ఓ ప్రభుత్వ స్థలం ఆక్రమణకు కబ్జాదారులు విడతలవారీగా చేస్తున్న ప్రయత్నం. హైటెక్ మండలం శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూములు యదేచ్చగా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం కాలనీలు, బస్తీలలో వదిలిపెట్టిన మిగులు స్థలాల్లో సైతం కబ్జాదారులు పాగా వేస్తున్నారు. రాత్రికి రాత్రే మిగులు భూములకు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్న ఆక్రమణదారులు పట్టపగలే యదేచ్చగా కబ్జా చేస్తున్నారు.  సిద్దిక్ నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తూ మరోసారి ప్రారంభమైన నిర్మాణ పనులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వేనెంబర్ 135, 136 లలో అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ బస్తీలలో భవిష్యత్ అవసరాల కోసం మిగులు భూములను వదిలిపెట్టారు.  ఈ బస్తీల పక్కనే హైటెక్ సిటీ ఏర్పాటు కావడం.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పుట్టుకు రావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది కబ్జాదారులు సిద్దిక్ నగర్ బస్తీలో ఉన్న మిగులు స్థలాలపై కన్నేశారు. సిద్దిక్ నగర్ బస్తీలో ఉన్న ఖాళీ స్థలంలో గత కొన్ని ఏళ్ల క్రితం దర్గాను ఏర్పాటు చేయగా, దర్గాకు అనుకొని ఉన్న ఖాళీ స్థలం బస్తీ అవసరాలకు ఉపయోగించాలని స్థానికులు భావించారు. కేవలం 100 గజాల స్థలం ఉండడంతో సదరు స్థలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. కాగా కొంతమంది కబ్జాదారులు సదరు స్థలానికి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కబ్జాకు ప్రయత్నించగా, గతంలో రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని కబ్జా భారీ నుంచి కాపాడి ప్రభుత్వ స్థలం బోర్డు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జూన్ లో సదరు స్థలాన్ని కజ్జాదారులు మరోసారి హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు 2023 జూన్ 21వ తేదీన అక్రమ కట్టడాలను కూల్చివేసి, ప్రభుత్వ స్థలం బోర్డులు ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల క్రితం సైతం కబ్జాదారులు ఈ స్థలంలో బోరు వేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.

మరోసారి నిర్మాణ పనులు.. తాజాగా గత రెండు రోజులుగా సదరు ప్రభుత్వ స్థలంలో జోరుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ దఫా ఏకంగా భవన నిర్మాణం కోసం పిల్లర్ల నిర్మాణం చేపట్టిన ఆక్రమణదారులు రాత్రింబవళ్లు పనులు చేపడుతూ కబ్జాను పరిపూర్ణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ళ మధ్య.. భవిష్యత్తు అవసరాల కోసం వదిలిపెట్టిన ప్రభుత్వ భూమిలో ఇంత యదేచ్చగా ఆక్రమణ కొనసాగుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెవెన్యూ అధికారులు బోర్డులు పాతి కాపాడిన ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుత రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు స్పందించి సిద్ధిక్ నగర్ బస్తీ మిగులు స్థలాలను కాపాడడంతో పాటు భవిష్యత్తులో మరోసారి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: