Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐటీ కారిడార్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ గుట్టు రట్టయింది. ఈ జల్సారాయుళ్లు ఏకంగా మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీని ఏర్పాటు చేసి ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కారు. రేవ్ పార్టీ చేసుకుంటూ మొత్తం 14మంది యువకులు, 6గురు యువతులు పట్టుబడగా, వీరివద్ద నుంచి విదేశీ మద్యం,1 గ్రాము కొకైన్, 2 గ్రాముల ఏండీఏంఏ డ్రగ్, 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ కు చెందిన నాగరాజు యాదవ్ అనే వ్యక్తి తన జన్మదినం పురస్కరించుకొని రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు.
Also Read : అమెరికా మాస్టర్స్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జగ్జీవన్ రెడ్డికి ఘనస్వాగతం
మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలోని క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించగా, పార్టీలో మొత్తం 14 మంది యువకులు,6 గురు యువతులు పాల్గొన్నారు. పక్కా సమాచారం తో క్లౌడ్ 9 అపార్టుమెంటు మీద దాడి చేసిన రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు మొత్తం 1.25 లక్షల విలువైన డ్రగ్స్, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో 5గురు యువకులను అరెస్టు చేసి, ఓ ఇన్నోవా క్రిస్ట కారును స్వాధీనం చేసుకున్నారు.
Admin
Ekaburu