Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని బీజేవైఎం సభ్యులు గురువారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరుతున్న యువత, బీఆర్ఎస్ నాయకులు గురువారం భారీ ఎత్తున నంది నగర్ లోని కేటీఆర్ నివాసానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలతో కేటీఆర్ స్వాగతం పలికారు.
Also Read : మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు
నూతనంగా పార్టీలో చేరిన వారు సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. అనంతరం కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన ఘనత కెసిఆర్, కేటీఆర్ లకు దక్కుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని అన్నారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu