Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు బస్తీలు,కాలనీల్లో గల ఆలయాలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, నేతాజీ నగర్, నల్లగండ్ల, టీఎన్జీవోస్ కాలనీ, జీపీఆర్ఏ క్వార్టర్స్ ఖాజాగూడ, రాయదుర్గం, బీహెచ్‌ఈఎల్ లలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పూజా కార్యక్రమాల అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.ఆషాడ,శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు.మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అని, అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Ekaburu