Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : డాక్టర్ బిఅర్ అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాల ఆరాధ్య దైవమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. భారత రాజ్యంగ నిర్మాత, భారత రత్న బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సాయిబాబా ఘనంగా నివాళులు అర్పించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో గల అంబేద్కర్ విగ్రహానికి గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగండ్లల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు.
Also Read : ఓటింగ్ పై పట్టణ ప్రజల మీద ఉన్న అపవాదును తొలగించాలి : కొండా సంగీతారెడ్డి
అంబేద్కర్ స్ఫూర్తితో గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి దళితుల సాధికారతకు పాటుపడిందని, దళిత బంధుతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. వారి కీర్తికి గుర్తింపుగా హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి గౌరవించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన స్ఫూర్తితో ప్రతిఒక్కరు వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చెన్నంరాజు, దారుగుపల్లి నరేష్, రమేష్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu