Monday, 14 September 2026 12:06:32 AM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా

Date : 28 July 2024 09:18 PM Views : 1313

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాయదుర్గం గోర్రెంక బస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపును సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఖాజాగూడ ఎస్సీ బస్తీలోని పోచమ్మ దేవాలయంలో స్థానికులతో కలిసి పూజలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్ లోని రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మాజీ కార్పొరేటర్ సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని అన్నారు.

శేరిలింగంపల్లి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దారుగుపల్లి నరేష్, గణేష్, భేరి రామచందర్ యాదవ్, నర్సింహరావు, క్రిష్ణా యాదవ్, ప్రభాకర్, సాయిబాబు, రాహుల్, యాదయ్య, శేఖర్, వెంకట్ రెడ్డి, నారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: