Tuesday, 28 July 2026 06:24:29 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : స్పెషల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుడికి ఆర్థిక సహాయం

Date : 30 March 2024 07:54 PM Views : 1176

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవాటు చేసుకోవాలని స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత అన్నారు. లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు అశోక్ నేత ముఖ్య అతిథిగా హజరయ్యారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన వికాలాంగుడు వెంకటయ్యకు వీల్ చైర్ నిమిత్తం 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు హోప్ ఫౌండేషన్ ముందుకు రాగా, శనివారం మేజిస్ట్రేట్ అశోక్ చేతుల మీదుగా చెక్కును వెంకటయ్యకు అందజేశారు. అనంతరం ప్రతి శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ వ్యవస్థాపకుడు కొండా విజయ్ కుమార్ తో కలిసి మేజిస్ట్రేట్ అశోక్ నేత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

Also Read : వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేవు

ఈ సందర్భంగా అశోక్ నేత మాట్లాడుతూ గత 73 వారాలుగా ప్రతి శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ను అభినందించారు. పేద విద్యార్థుల చదువుల కోసం, పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కోసం హోప్ ఫౌండేషన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ అధ్యక్షుడు తొపుగుండ మహిపాల్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: