Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 300 డివిజన్ల ఢీ లిమిటేషన్ ముసాయిదా విడుదల చేశారు. ఇందులో భాగంగా హైటెక్ మండలం శేరిలింగంపల్లి పరిధిలో 18 డివిజన్లు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతంలో ఉన్న 7 డివిజన్ల స్థానంలో ప్రస్తుతం 18 డివిజన్లుగా శేరిలింగంపల్లి మండలాన్ని విభజించారు. గతంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో గచ్చిబౌలి, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, మజీద్ బండ, శ్రీరామ్ నగర్ కాలనీ, అంజయ్య నగర్, హైటెక్ సిటీ , మాదాపూర్, ఇజ్జత్ నగర్, కొండాపూర్, మాతృశ్రీ నగర్, ఆఫీస్ పెట్, మదీనాగూడ, చందానగర్, దీప్తి శ్రీనగర్, మియాపూర్, బి కే ఎనక్లేవ్, మయూరి నగర్ డివిజన్లుగా విభజించి ముసాయిదా రూపొందించారు. ఈ ముసాయిదాపై తుది నిర్ణయం వెలువడవలసి ఉంది. ఈ ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 7 రోజుల గడువు ఇచ్చారు.
Admin
Ekaburu