Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర దేవస్థానం చైర్మన్ పురం విజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా ప్రత్యేక పూజలు, స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సోమేశ్వర స్వామి దేవస్థానం పూజల్లో పాల్గొన్న భక్తులకు మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read : కొండాపూర్ లో శక్తి వందన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నల్లగండ్ల సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఈ పూజలకు పరిసర ప్రాంతాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అన్నారు. మహా శివరాత్రికి ఉపవాసం, జాగరణ ఉండే భక్తులకు మరుసటి రోజు అన్నసమారాధన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సోమేశ్వర స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం తన అదృష్టమని, గచ్చిబౌలి డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజల్లో సాయిబాబాతో సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పురం విజేందర్ రెడ్డి, సభ్యులు, చెన్నం రాజు, ఆకుల యాదగిరి, గిరి, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu