Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బూత్ స్థాయి ప్రచారమే విజయానికి మూలమని, కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానకరామ్ గూడలోని బీజేపీ కార్యాలయంలో బిజెపి బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న యువత, బిజెపి శ్రేణులకు జూబ్లీహిల్స్ ఎన్నికలపై బూత్ కమిటీ సభ్యులు చేపట్టవలసిన కార్యక్రమాలను, బూత్ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టడంతో పాటు బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ ను కలవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకేల్లాలని కార్యకర్తలకు సూచించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. క్షేత్ర స్థాయిలో కష్టపడ్డ వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కష్టపడ్డ వారిని గుర్తించి డివిజన్ కమిటీల్లో నియమించడం జరుగుతుందన్నారు.
Also Read : స్విమ్మింగ్ పూల్ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు.. డివిజన్ కమిటీల్లో పదవులు దక్కించుకున్న వారికి అభినందనలు తెలుపిన గంగాధర్ రెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా రాకేష్, ఉపాధ్యక్షుడిగా కులదీప్ సింగ్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సునీల్ సింగ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శ్యామ్ రాథోడ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ నాయక్, జనరల్ సెక్రెటరీ శ్రీశైలం, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోపాల్, జనరల్ సెక్రెటరీ సహదేవ్, ట్రెజరర్ సాయినాథ్, బీజేవైఎం ఉపాధ్యక్షులుగా వంశీ గౌడ్, విక్రమ్ గౌడ్, జనరల్ సెక్రెటరీ విష్ణు, రాకేష్ గౌడ్, సెక్రెటరీ జ్ఞానేశ్వర్, ట్రెజరర్ సాయితేజలు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్ రాందీన్, మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు గంగల రాధాకృష్ణ యాదవ్, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, మాజీ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ధీరజ్, ఉదయలక్ష్మి, అసవరి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నరసింహారావు, సురేష్, అశోక్, సంజీవ, నరేందర్ ముదిరాజ్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, కిషన్ గౌలి, బబ్లూ సింగ్, దినేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సుమన్, ప్రకాశ్, సామ్రాట్ గౌడ్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu