Monday, 14 September 2026 12:08:59 AM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

వర్షాకాలంలో నగర వాసులకు మంచినీటి సమస్యలా:  గంగల రాధాకృష్ణ యాదవ్

మాదాపూర్ సాయి నగర్ వాసుల ఆందోళనకు మద్దతు తెలిపిన రాధాకృష్ణ యాదవ్

Date : 02 August 2024 11:49 PM Views : 1281

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ఓ వైపు రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తూ రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండుతుండగా, అధికారులు మాత్రం హైటెక్ సిటీ వాసులకు ఎండాకాలంలో ఏర్పడిన మంచినీటి సమస్యను నెలలు గడుస్తున్నా పరిష్కరించకపొవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహించారు. మాదాపూర్ సాయి నగర్ తో పాటు హరిజన బస్తిలో గత రెండు నెలల నుంచి మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుండడంతో  స్థానికులు శుక్రవారం మాదాపూర్ జలమండలి కార్యాలయంలో ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనపై సమాచారం అందుకున్న మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేపీ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్ జలమండలి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్దతు తెలిపారు.

Also Read : ఇంజనీరింగ్ విద్యార్థికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ప్రోత్సాహం

కార్యాలయంలో ఉన్న జలమండలి మేనేజర్ యాదగిరి తో రాధాకృష్ణ యాదవ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సాయి నగర్ వాసుల గత రెండునెలలుగా మంచినీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేటికి సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. సాధ్యమైనంత త్వరగా మంచినీటి సమస్య ను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజులలో రెండు విజిట్స్ చేసి సమస్యను పరిష్కరిస్తానని వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో బస్తివాసులు నర్సింహా, సుభాని, ఆనంద్,శివ, కుమార్ స్వరూప, నాగేశ్వరరావు, లక్ష్మణ్,గోపాల్, రాజు, ఉపేందర్, సంపాన్ లాల్, నిరంజన్, వినయ్,రాజు, చిరంజీవి, జగతి దేవి, స్వరూప,నాగేశ్వరరావులతో పాటు పలువురు బస్తివాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: