Wednesday, 29 July 2026 11:36:04 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

బీజేపీ హయాంలో నయా భారత్ ఆవిష్కరణ: కొండా విశ్వేశ్వరరెడ్డి

Date : 16 March 2024 07:17 PM Views : 713

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో నయా భారత్ ఆవిష్కృతమైందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని బిజెపి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గం మైహోం భుజా ఆవరణలో స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కొండా విశ్వేశ్వరరెడ్డి శనివారం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశం బిజెపి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. కొన్నేళ్ల క్రితం డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రవేశపెడితే కొంతమంది విమర్శించారని, నిరక్షరాశ్యులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఈ చర్య విఫలమవుతుందని వాధించారన్నారు. కానీ నేడు దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా, ఏ చిన్న వ్యాపార సముదాయంలోనైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా లావాదేవీలు జరుగడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన దక్షతకు, దూరదృష్టికి ఇది నిదర్శనమన్నారు.

Also Read : ఖాజాగూడ స్కూల్ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలి : సాయిబాబా

సంస్కృతి, సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిళ్లని, మన వేదపండితులు ఇచ్చే ఆశీర్వాదం మరే దేశంలో ఉండదన్నారు. ధైర్య, స్థైర్య, విజయ అంటూ వేదపండితులు ఆశీర్వదించే పద్ధతిలోనే ఎంతో మహత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా మరోసారి విజయడంఖా మోగించి ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ రానున్న రోజుల్లో ప్రపంచ సూపర్ పవర్ గా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ తో పాటు నరసింహరాజు, పవన్, అరవింద్, సంతోష్, ప్రసాద్, మైహోం భుజా కమ్యూనిటీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: