Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల డైలీవిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 కు పెంచి.. 30 సర్కిళ్లను 60 సర్కిల్ గా చేశారు. మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో 300 డివిజన్లతో నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో ప్రస్తుతం ఉన్న శేరిలింగంపల్లి జంట సర్కిళ్లను 3 సర్కిళ్లకు పెంచారు. గతంలో శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లు ఉండగా, ప్రస్తుతం శేరిలింగంపల్లి, మియాపూర్, మాదాపూర్ సర్కిళ్లుగా విభజించారు. మియాపూర్ సర్కిల్ పరిధిలో ఆఫీస్ పెట్, మదీనాగూడ ,చందానగర్, దీప్తి శ్రీనగర్ ,మియాపూర్, మక్త మహబూబ్పేట్ డివిజన్లను చేర్చారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గచ్చిబౌలి, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, మజీద్ బండ, శ్రీరామ్ నగర్, కొండాపూర్ డివిజన్లను చేర్చారు. అంజయ్య నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ,ఇజ్జాత్ నగర్, మాతృశ్రీ నగర్, మయూరి నగర్ లతో కొత్తగా మాదాపూర్ సర్కిల్ ను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న రెండు సర్కిళ్లు ఒకే జోన్ కింద ఉండగా.. ప్రస్తుతం ఏర్పాటుచేసిన మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లను శేరిలింగంపల్లి జోన్ పరిధిలో.. మాదాపూర్ సర్కిల్ ను కూకట్పల్లి జోన్ పరిధిలో చేర్చారు.
Also Read : ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ..
Admin
Ekaburu