Wednesday, 29 July 2026 08:26:27 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మియాపూర్ లో అక్రమ భవనంపై హైడ్రా యాక్షన్

నకిలీ ఎల్ఆర్ఎస్ సృష్టించి ఐదంతస్థుల భవనం నిర్మించిన కేటుగాళ్లు

Date : 01 November 2025 12:16 PM Views : 1262

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : మియాపూర్ లో అక్రమ భవనంపై హైడ్రా యాక్షన్ ప్రారంభించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు తీసుకొని పక్కనే ఉన్న శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఓ అక్రమ భవనాన్ని హైడ్రా అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేత పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. ఏకంగా హెచ్ఎండిఏ భూమికే ఎసరు పెట్టిన కేటుగాళ్లు నకిలీ ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కు కట్టినట్టు నకిలీ డిడిని సృష్టించి అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

Also Read : సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు విడుదల

అమీన్పూర్ మండల పరిధిలోని సర్వేనెంబర్ 337, 338 ల పక్కనే శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వేనెంబర్ 101 ప్రభుత్వ స్థలం ఉంది. అమీన్పూర్ సర్వేనెంబర్ 337 338 లలో ఉన్న హుడా అప్రూవ్డ్ లేఔట్ లో 400 గజాల విస్తీర్ణం గల 126 ప్లాట్ నెంబర్ ను భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని మియాపూర్ సర్వేనెంబర్ 101 లోని హెచ్ఎండిఏ ప్రభుత్వ స్థలాన్ని 473 గజాల మేర ఆక్రమించారు. ఆక్రమించిన స్థలానికి 126/D , 126/ part, 126/C గా పేరుతో ప్లాట్లను సృష్టించారు. అనంతరం మొత్తం 873 గజాల విస్తీర్ణానికి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి అనుమతులు తీసుకున్నారు. సదరు అనుమతుల కోసం నకిలీ ఎల్ఆర్ఎస్ ను సైతం సృష్టించారు. చివరికి ఎల్ఆర్ఎస్ కోసం చెల్లించే డిడిని సైతం నకిలీది సృష్టించిన కేటుగాళ్లు దర్జాగా ఐదంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టారు. 2014లో ఎల్ఆర్ఎస్ మంజూరైనట్లు నకిలీ పత్రాలను సృష్టించి అనుమతులు తీసుకున్నారు. కాగా సర్వే నెంబరు 101 హెచ్ఎండిఏ ప్రభుత్వ స్థలం ఆక్రమణపై హెచ్ఎండిఏ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు 473 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టినట్లు తేల్చారు. ఈ మేరకు నకిలీ ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ డిడి నీ సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి తదితరులపై ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం సర్వే నెంబర్ 101 హెచ్ఎండిఏ ఆధీనంలోని ప్రభుత్వ స్థలంలో 473 గజాల విస్తీర్ణంలో చేపట్టిన ఐదంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. భారీ యంత్రాలతో, పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: