Tuesday, 28 July 2026 06:23:52 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలి

జీహెచ్ఏంసీ, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేసిన జనంకోసం

Date : 19 March 2024 10:40 PM Views : 1039

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించడంతో పాటు సదరు ఇంటికి ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణం చేపట్టిన మియాపూర్ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధికారులకు పిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మియాపూర్ కార్పొరేటర్ ను తన పదవి నుంచి భర్తరఫ్ చేయడంతో పాటు ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి తహశీల్దార్ కు ఆధారాలతో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 44 రికార్డు ల ప్రకారం ప్రభుత్వ భూమి అని, ఈ భూమిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ భారీగా అధికార దుర్వినియోగానికి, ఉల్లంఘనలకు పాల్పడ్డాడని అన్నారు.

Also Read : జెఎన్టీయూలో ఈనెల 30,31న ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు

దొంగదారిలో అధికారులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు కార్పొరేటర్ పదవిని దుర్వినియోగం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మించుకున్నాడని అన్నారు. అధికారులను మభ్యపెట్టి, భయపెట్టి, తప్పుదారి పట్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్న ఇంటికి రహదారి ఏర్పాటు చేసుకున్నాడన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, ఖర్చు చేసిన నిధులను కార్పొరేటర్, అధికారుల నుంచి వసూలు చేయాలన్నారు. సర్వే నెంబర్ 44పై న్యాయస్థానం లో శాశ్వత నిర్ణయం వచ్చే వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా తగిన అదేశాలు ఇవ్వాలని అధికారులకు పిర్యాదు చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: