Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టుకు శనివారం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేలు బాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇదే కేసులో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ.. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించడంలేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరు కాగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Admin
Ekaburu