Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : పేదవారిని ఆదుకునే మనసున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి శుక్రవారం బొటానికల్ గార్డెన్ లో ప్రచారం నిర్వహించారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లోని మార్నింగ్ వాకర్స్ తో సమావేశమైన సంగీతా రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు భారత దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, అవినీతిరహిత పాలన అందించిన మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Also Read : 30వ అంతస్థు నుంచి కిందపడి కార్మికుడి మృతి
నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే కొండా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, చేవెళ్ల విజయాన్ని మోడీకి బహుమతిగా అందించాలని అన్నారు. ఓటు వేసే ముందు బీజేపీ నేతృత్వంలో దేశం ఎంత పటిష్టమైన దిశలో పయనిస్తుందో గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, నాయకులు ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సంతోష్, శ్రీశైలం యాదవ్, రవి నాయక్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu