Saturday, 18 April 2026 07:08:55 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

30వ అంతస్థు నుంచి కిందపడి కార్మికుడి మృతి

కెఎల్ సీ నిర్మాణ సంస్థ మీద కేసు నమోదు

Date : 05 April 2024 09:25 PM Views : 860

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం 30వ అంతస్థు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందగా, రక్షణ చర్యలు తీసుకోకుండా పనులు చేపడుతున్న కెఎల్ సీ నిర్మాణ సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పశ్చిమ బెంగాల్ కు చెందిన ఖైరూల్ మియా(32) గత పదిహేను రోజుల క్రితం బంధువు మత్యుర్ మండా తో కలిసి నగరానికి వచ్చాడు. లింగంపల్లిలో క్యాండూర్ క్రిసెంట్ పేరుతో భారీ బహుళ అంతస్థుల నిర్మాణం చేపడుతున్న కెఎల్ సీ సంస్థ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం 30వ అంతస్థులో పనిచేస్తూ ఖైరూల్ 11వ అంతస్థుకు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో ఖైరూల్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్మికుడి మృతికి కారణమైన కెఎల్ సీ సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :