Saturday, 18 April 2026 07:06:42 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఐటీ కారిడార్.. అర్థరాత్రి.. మద్యం మత్తులో కారుతో ఐటీ ఉద్యోగి..

అరగంట వ్యవధిలో 4ప్రమాదాలు - వ్యక్తి మృతి, 8మందికి గాయాలు

Date : 16 April 2024 12:03 AM Views : 991

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న ఓ ఐటీ ఉద్యోగి కారు బ్రేకులు లేకుండా వెళ్లింది. మితిమీరిన వేగంతో గచ్చిబౌలి ఐటీ కారిడార్ వరిధిలో బీభత్సం సృష్టించిన ఐటి ఉద్యోగి రహదారి మీద కనిపించిన వాహనాన్ని కనిపించినట్లు ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. దాదాపు అర్థగంట పాటు హైటెక్ సిటీ రహదారుల మీద వీరంగం సృష్టించిన కారు మొత్తం 4 ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమైంది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఐటీ ఉద్యోగి రాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది గాయపడగా, అందులో గుర్తు తెలియని పాదచారి మృతిచెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... నిజాంపేటలో నివాసం ఉంటూ ఐటి కంపెనీలో పనిచేస్తున్న క్రాంతికుమార్(30) ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించాడు. అనంతరం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో తన వోక్స్ వ్యాగన్ పోలో కారును తీసుకొని హైటెక్ సిటీ రహదారిపై వరుగులు పెట్టించాడు.

Also Read : అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మితిమీరిన వేగంతో నడుపుతూ అడ్డువచ్చిన వాహనాలను ఢీకొడుతూ అర్థరాత్రి 12.30 నుంచి 1గంట వరకు అర్థగంట పాటు రహదారిపై వీరంగం సృష్టించాడు. మొదట మైండ్ స్పేస్ చౌరస్తా సమీపంలోని ఐకియా వద్ద ఓ కారును ఢీకొట్టిన క్రాంతికుమార్ తన కారును అవకుండా వరుగెత్తించాడు. అక్కడి నుంచి శిల్పా ఫ్లైఓవర్ మీద వేగంగా ప్రయాణించగా, కారు అదుపుతప్పి ముందున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. వెంటనే అక్కడి నుంచి కారుతో పరారైన క్రాంతికుమార్ గచ్చిబౌలి మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్ వైపు కారును మళ్లించాడు. ఈ క్రమంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ సమీపంలోని ఫిస్తా హౌజ్ ముందు రహదారిపై వెళ్తున్న పాదచారుడిని క్రాంతికుమార్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని పాదచారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఓ ఆటోను ఈ కారు ఢీకొట్టింది.

అర్ధగంట పాటు కారు చేసిన బీభత్సం కారణంగా నాలుగు ప్రమాదాలు చోటుచేసుకోగా, మొత్తం 9 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గుర్తు తెలియని పాదచారుడు మృతిచెందాడు. ఈ ప్రమాదాల్లో ఓ కారు, మూడు ద్విచక్రవాహనాలు, ఓ ఆటో ద్వంసమయ్యాయి, కాగా మల్కం చెరువు ప్రమాదం అనంతరం క్రాంతికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, 550 వచ్చిందని తెలిసింది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :