Wednesday, 29 July 2026 07:56:13 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్

రూ.52 లక్షలు దారిమళ్లించిన కాంట్రాక్టు ఉద్యోగి

Date : 03 September 2024 05:32 AM Views : 1126

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల సంతకాలను పోర రీ చేసిన ఓ ఉద్యోగి ఏకంగా 52 లక్షల వర్సిటీ నిధులను దారి మళ్లించాడు. వర్సిటీ ఆడిట్ లో విషయం వెలుగుచూడగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అకౌంట్స్ సెక్షన్ లో పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ ఉర్దూ యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్ లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని భారీ కుట్రకు తెరలేపాడు. ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా 52లక్షల రూపాయల నిధులను తన ఖాతాకు మళ్లించాడు. ఇటీవల జరిపిన ఆడిట్ లో ఈ కుట్రను యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో జాకీర్ హుస్సేన్ ఈ కుట్రకు పాల్పడినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం నిధుల గోల్ మాల్ విషయమై రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన జాకీర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : అక్రమ నిర్మాణం... ప్రమాదకరం... పరిసరాలు అంధకారం

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: