Wednesday, 29 July 2026 07:54:15 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

సినిమాల్లో అవకాశం కల్పిస్తానని సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

తెలుగు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

Date : 01 August 2024 12:28 AM Views : 1036

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సినిమాల్లో అవకాశం కల్పిస్తానని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని నమ్మించిన అసిస్టెంట్ డైరెక్టర్ మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ కు చెందిన దంతులూరి సిద్ధార్థ వర్మ(30) నగరానికి వచ్చి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సిద్దార్థ వర్మకు ఓ స్నేహితురాలి ద్వారా బాధిత యువతి వరిచయం అయ్యింది.

Also Read : బోనాల ఉత్సవాల కోసం శేరిలింగంపల్లి దేవాలయాలకు ప్రభుత్వ నిధులు : ఎమ్మెల్యే గాంధీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపుర్ జిల్లాకు చెందిన బాధిత యువతి నగరంలోని పుప్పాలగూడలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. కాగా సినిమాల్లో అవకాశం కల్పిస్తానని యువతిని నమ్మించిన సిద్దార్థ వర్మ తన ఇంటికి పిలిపించుకుని, మద్యం సేవించిన తరువాత మద్యం మత్తులో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత యువతి మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు బుధవారం నిందితుడు సిద్దార్థ వర్మను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: