Wednesday, 22 April 2026 07:11:04 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మంచినీటి సంపులో పడి ఐటీ ఉద్యోగి మృతి

హాస్టల్ నిర్వాహకులపై కేసు నమోదు

Date : 22 April 2024 07:37 PM Views : 905

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : తాను నివాసం ఉంటున్న హాస్టల్ భవనం మంచినీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయి ఓ ఐటీ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. వర్కింగ్ హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సంపు మూతను తీసి ఉంచడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ అక్మల్ సువుయాన్(25) ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చాడు. ఐటి కారిడార్ పరిధిలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ గచ్చిబౌలి అంజయ్యనగర్ లోని షణ్ముఖ్ మెన్స్ పిజి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. హాస్టల్ నిర్వాహకులు సోమవారం ఉదయం భవనం సెల్లార్ లో ఉన్న మంచినీటి సంపును తెరిచి మోటార్ వేశారు. అదే సమయంలో ఉదయం 10.30కు టిఫిన్ తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన సుఫుయన్ తిరిగి హాస్టల్ కు వచ్చాడు.

Also Read : చేవెళ్ల గడ్డపై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ నమోదు చేస్తాం: సాయిబాబా

తెరిచి ఉన్న సంపు మూతను చూసుకోకుండా లోపలికి వచ్చిన సుపుయన్ అందులో పడిపోయాడు. టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సువుయాన్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానంతో మంచినీటి సంపులో గాలించగా, అప్పటికే మృతిచెందిన అక్మల్ సుఫుయాన్ మృతదేహం కనిపించింది. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సుఫుయాన్ మృతదేహాన్ని సంపులో నుండి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మంచినీటి సంపు మూత తీయడంతో పాటు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై హాస్టల్ నిర్వాహకుడు మధుసూధన్ రెడ్డి మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :