Wednesday, 29 July 2026 11:36:04 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

నగరంలో గంజాయి 'ఘాటీ' లు అరెస్టు

45 కిలోల గంజాయి స్వాధీనం

Date : 07 October 2025 10:28 PM Views : 430

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఈ మధ్యే నటి అనుష్క ప్రధాన పాత్రలో విడుదలైన చిత్రం ఘాటీ.. ఈ సినిమాలో గంజాయి స్మగ్లర్లు గంజాయిని అడవులు దాటించేందుకు ఉపయోగించే కూలీలే ఘాటీలు... ఈ సినిమా తరహాలోనే గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్న రియల్ ఘాటీలు ముగ్గురు నగరంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా, ఓ పురుషుడు ఉన్నాడు. సినిమాకు, రియల్ కు ఒకటే తేడా.. సినిమాలో ఘాటీలు గంజాయిని కొండల మీదుగా అడవులు దాటించగా.. రియల్ గా మాత్రం రైళ్లలో గంజాయిని రాష్ట్రాలు, నగరాలు దాటిస్తున్నారు... విశాఖపట్నం నుండి హైదరాబాద్​ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని చందానగర్​ పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 45 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అల్లూరి సీతరామరాజు జిల్లా అరకువ్యాలీలోని జాకరవలస గ్రామానికి చెందిన కొర్ర బులికి(31), హుకుంపేట మండలం రంగశీల గ్రామానికి చెందిన పాంగి వెంకట్(35), అనంతగిరి మండలం జెండాగరువు గ్రామానికి చెందిన సెంబి దివ్య రాణి(21) ముగ్గురు కలిసి ఈజీ మనీ కోసం గంజాయి తరలించేందుకు నిర్ణయించుకున్నారు. ఆంధ్రా నుంచి గంజాయిని ముంబైకి తరలించి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని గంజాయితో విశాఖపట్నం నుండి ముంబైకి ట్రైన్​లో బయలుదేరారు. రైలులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నగరంలోని చందానగర్​ పోలీసులు మంగళవారం లింగంపల్లి రైల్వే స్టేషన్​ ఒకటో ఫ్లాట్​ఫామ్​ మీద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 21 ప్యాకెట్లలో 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: