Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : దట్టంగా అలుముకున్న పొగ మంచు కారణంగా నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పొగ మంచుతో ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగర వాసులను చలి తీవ్రత వణికిస్తుండగా, వాహనదారులను సైతం ఇబ్బందులు పెడుతుంది. తెల్లవారు జామున బయలుదేరి వెళ్లే ప్రయాణికులు పొగ మంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ బెంగళూరు రహదారిపై శంషాబాద్ దాటిన తర్వాత దట్టంగా పొగ మంచు అలుముకోవడంతో వాహనదారులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందున్న రహదారి సైతం కనిపించనంతగా పొగ మంచు ఉండడంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి వేశారు. దీంతో శంషాబాద్ బెంగళూరు రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపించాయి.
Also Read : రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్..
Admin
Ekaburu