Saturday, 18 April 2026 07:08:56 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఎల్ఆర్ఎస్ పేరుతో 20వేల కోట్లు దోచుకుంటున్న ప్రభుత్వం : కేటీఆర్

మార్చి 6న బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

Date : 04 March 2024 06:59 PM Views : 925

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి20కోట్ల రూపాయలు దోచుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెలుకువస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ వద్దని, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అడ్డగోలుగా మాట్లాడిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, వారంతా ఇప్పుడు నోరు ఎందుకు తెరవడం లేదు అని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన తెలుగు నటి అరెస్ట్

ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అని నాడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :