Saturday, 18 April 2026 07:09:24 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన తెలుగు నటి అరెస్ట్

Date : 04 March 2024 09:36 AM Views : 879

Ekaburu - క్రైమ్ / : స్నేహితురాలి ఇంట్లో బంగారం చోరీ చేసిన తెలుగు సినీ నటిని పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితురాలిని నమ్మించి, ఆమే ఇంట్లోకి ప్రవేశించి కిలో బంగారు ఆభరణాలు దొంగతనం చేసింది టాలీవుడ్ నటీ సౌమ్య శెట్టి. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ కుమార్తె మౌనిక యూట్యూబర్. యూ ట్యూబర్, నటి సౌమ్య శెట్టితో మౌనిక కు పరిచయం అయ్యింది. సౌమ్య శెట్టి తరచూ మౌనిక ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో మౌనిక బెడ్ రూమ్ లో ఉంచిన బంగారు ఆభరణాలను గమనించిన సౌమ్య వాటిని చోరీ చేయాలని పథకం వేసింది. ఇంటికి వచ్చిన ప్రతిసారి వాష్ రూమ్ పేరుతో మౌనిక గదిలోకి వెళ్లిన సౌమ్య గదిలో ఉన్న దాదాపు 1కిలో బంగారు ఆభరణాలు చోరీ చేసింది.

Also Read : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది: రామస్వామి యాదవ్

చోరీ చేసిన బంగారంలో కొంత విక్రయించి తన కుటుంబాన్ని గోవా టూర్ కు తీసుకువెళ్లింది. కాగా ఇంట్లో బంగారం పోవడం గమనించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తులో పోలీసులకు సౌమ్య మీద అనుమానం వచ్చింది. సౌమ్య ఈ మధ్య డబ్బు ఖర్చు చేయడం, కుటుంబాన్ని గోవాకు తీసుకువెళ్లడంతో అనుమానించిన పోలీసులు సౌమ్య ను విచారించారు. విచారణలో పక్కా ప్లాన్ ప్రకారం సౌమ్య శెట్టి ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు చోరీకి గురైన బంగారంలో కొంత సౌమ్య వద్ద రికవరీ చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సౌమ్య శెట్టి యూట్యూబర్ గా పాపులర్ కాగా, ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ వంటి పలు సినిమాల్లో నటించింది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :