Wednesday, 29 July 2026 07:16:50 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

గంజాయి ట్రాన్సుపోర్టు 'వయా' ఔటర్ రింగురోడ్డు

కొల్లూరు ఔటర్ టోల్ గేట్ వద్ద 32 కిలోల గంజాయి సీజ్

Date : 07 April 2024 11:16 AM Views : 1028

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి వరప్రదాయని ఐన ఔటర్ రింగు రోడ్డు గంజాయి స్మగ్లింగ్ కు రాచబాటగా మారుతుంది. భారీ ఎత్తున నగరాన్ని ముంచెత్తుతున్న గంజాయి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఎవ్వరి కంటబడకుండా ఔటర్ ఎక్కితే చాలు.. క్షేమంగా గమ్యానికి చేరుకోవచ్చనే ఆలోచనతో గంజాయి స్మగ్లర్లు ఔటర్ రింగు రోడ్డును తమ రవాణా కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఎక్కడ బందోబస్తు లేదో చూసి ఔటర్ ఎక్కడం... అనువైన ఎక్జిట్ చూసుకొని ఔటర్ దిగి నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్, ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేయడం ఔటర్ రింగు రోడ్డు స్మగ్లర్లకు అత్యంత అనువయిన రహదారిగా మారిపోయింది. నగరానికి వచ్చే గంజాయి తో పాటు తెలంగాణ మీదుగా రాష్ట్రాలు దాటే గంజాయి రవాణాకు సైతం స్మగ్లర్లు ఔటర్ నే ఎంచుకుంటున్నారు.

Also Read : బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి

గతంలో పలు సందర్భాల్లో ఔటర్ మీదుగా రాష్ట్రాలు దాటుతున్న గంజాయితో పాటు నగరానికి చేరుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నా, అది రవాణా అవుతున్న సరుకులో పావుశాతనికంటే తక్కువేనని భావిస్తున్నారు. మిగిలిన మొత్తం క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతుంది. తాజాగా ఆదివారం ఉదయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కొల్లూరు ఔటర్ టోల్ గేటు వద్ద 32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. పట్టుబడిన గంజాయి విలువ 10.50 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. బానోతు లక్ష్మణ్ అనే యువకుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద ఒక్కోటి 2కిలోల బరువున్న 16 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్దకు చెందిన లక్ష్మణ్ పటన్ చెరు పరిధిలోని బానురు వెలిమలలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేస్తుండగా పోలీసులు లక్ష్మణ్ ను పట్టుకున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: