Saturday, 18 April 2026 07:07:06 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

పోలీసుల విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్

వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు

Date : 01 March 2024 11:11 PM Views : 890

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ శుక్రవారం పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగగా, అర్థరాత్రి పోలీసులు హోటల్ మీద దాడి చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న దర్శకుడు క్రిష్ మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి క్రిష్ పరారీలో ఉన్నాడు. క్రిష్ మీద పోలీసులు 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి గాలింపు చేపట్టారు. కాగా తనకు ముందస్తు బెయిల్ కోసం తన న్యాయవాదితో శుక్రవారం ఉదయం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న క్రిష్, సాయంత్రం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరయ్యాడు.

Also Read : ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌లో తిరిగి చేరిన తెలంగాణ‌ రాష్ట్రం

క్రిష్ ను విచారించిన పోలీసులు, న్యాయవాది సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో క్రిష్ కొకైన్ తీసుకున్నట్టు తేలితే పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, టాలీవుడ్ నిర్మాత కేదారినాథ్, వ్యాపారి నిర్భయ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్స్ సరఫరాదారులు అబ్బాస్, వహిద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు నటి లిషి గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, నీల్ లు పరారీలో ఉన్నారు. వీరిలో నీల్ విదేశాలకు పారిపోయాడు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :