Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటి కారిడార్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు లింకులను పోలీసులు ఒకేసారి చేధించారు. హైటెక్ సిటీ పరిధిలోని ప్రైవేటు హాస్టళ్లలో మకాం వేసి, స్థానిక ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు వీరి వద్ద సంచి 32.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్. 4.67 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం మాదాపూర్ డిసిపి కార్యాలయంలో ఆడిషనల్ డిసిపి ఉదయ్ రెడ్డి వెల్లడించారు.. గచ్చిబౌలి ఐటి కారిడార్ పరిధిలోని టీఎన్ జీఓ కాలనీలో గల ఎస్ఎం లగ్జరీ కో- లివింగ్ హాస్టల్ కేంద్రంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఈనెల 3వ తేదీన దాడులు నిర్వహించారు.
Also Read : మియాపూర్ లో అక్రమ భవనంపై హైడ్రా యాక్షన్
ఈ దాడుల్లో కడవ జిల్లాకు చెందిన గుంత తేజక్రిష్ణ, ఐటి ఉద్యోగి పాకనాటి లోకేష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కొంతమొత్తం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్లోని నైట్ ఐ హోటల్ మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెన్నెల రవికిరణ్, పెద్దమంతూర్ హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, సాజీర్ మోతుంగాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ బర్త్ డే కోసం డ్రగ్స్ పార్టీ ఏర్పాట్లు చేస్తుండగా వీరిని అరెస్టు చేసిన పోలీసులు రెండు ప్రాంతాల్లో నిందితుల వద్ద నుంచి మొత్తం 6 లక్షల విలువైన 32.14 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్. 4.67 గ్రాముల గంజాయి, 6 సెల్ఫోన్లు, రెండు బైకులు, 10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ సేవించే కొనుగోలుదారులు వృద్వీ విష్ణువర్ధన్. కార్లపూడి ప్రీస్ట్ సుజీత్, మేకల గౌతం, గుండెబోయిన నాగార్జున, గుంటక సతీష్ రెడ్డిలతో కలిపి మొత్తం 11మందిని అరెస్టు చేశారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లతో పాటు వినయ్, లక్ష్మణ్, రెజ స్వాన్, కార్తీక్, వంశీ, హర్ష అనే మరో 8మంది వరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు నైజీరియన్ల నుంచి కొనుగోలు... బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ నైజీరియన్ నుంచి టిఎన్జఓ కాలనీలో పట్టుబడిన తేజక్రిష్ణ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా, మరో నైజీరియన్ నుంచి మాదాపూర్లో పట్టుబడిన సాజీర్ మోతుంగర కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. వీరు స్థానికంగా ఉండే విక్రేతలకు, పలువురు డ్రగ్స్ సేవించే వారికి విక్రయిస్తున్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువగా ఐటి ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా ఒకరికి ఒకరు కలుసుకొని, ఆన్లైన్లో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకుంటూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు హాస్టళ్లు, కో లివింగ్ కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు ఏడిసిపి తెలిపారు. సమావేశంలో మాదావూర్ ఏసిపి శ్రీధర్, గచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్, డీఐ నరేష్, ఎస్ఓటీ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu