Wednesday, 22 April 2026 07:16:44 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలిలో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా

రూ.4 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

Date : 14 August 2024 11:20 PM Views : 964

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మరో భారీ డ్రగ్స్ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. సైబరాబాద్ ఎస్ఓటీ, టిజి నాబ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి డ్రగ్స్ ముఠాను వలపన్ని పట్టుకున్నారు. ఖరీదైన కార్లలో ఐటి కారిడార్ కు వచ్చిన 4గురు డ్రగ్స్ సరఫరాదారులను, 4గురు కొనుగోలుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 4కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి టెలికాంనగర్ లో డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, రాయదుర్గం పోలీసులు, టిజి నాబ్ అధికారులు నిఘా పెట్టారు. రాజస్థాన్ కు చెందిన నలుగురు డ్రగ్స్ వ్యాపారులు నిషేధిత హెరాయిన్ తో టెలికాంనగర్ కు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. డ్రగ్స్ వ్యాపారులతో పాటు మరో నలుగురు డ్రగ్స్ కొనుగోలుదారులు సైతం పోలీసుల చేతికి చిక్కారు. వీరి వద్ద నుంచి 4.30 కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన హుందాయ్ క్రెటా, మహేంద్రా ఎక్స్ యువి 500 కార్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :