Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో గ్రామాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఈ మొదటి విడత ఎన్నికల్లో 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు పంపిణీ చేపట్టారని తెలుస్తుంది. ఇందులో శంషాబాద్ నర్కుడ గ్రామం వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో మొత్తం 4వేల ఓటర్లు ఉండగా, ఇక్కడి అభ్యర్థులు ఓటుకు రూ.15000–20000 వరకు పంచారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే తెలంగాణ ఎన్నికల్లో ఇదో రికార్డుగా నిలుస్తోంది.
Admin
Ekaburu