Saturday, 18 April 2026 07:15:59 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి : కేటీఆర్

Date : 28 February 2024 10:52 PM Views : 922

Ekaburu - తెలంగాణ / పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవ, అవాస్తవాలపై రూపొందించిన కరపత్రాన్ని సిరిసిల్లలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మత్తులు చేసి ప్రాజెక్ట్ ను పునరుద్దరణ చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర పన్నుతోందాన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్ గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను మంటగలుపుతోందని విమర్శించారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టిగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు.

Also Read : ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1వ తేదీన చలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాస్తవ, అవాస్తవాలను వివరిస్తూ రూపొందించిన ఈ కరపత్రాన్ని చదివితే పూర్తిగా అవగతమవుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పికొట్టాలని కోరారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :