Friday, 11 September 2026 07:12:10 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ప్రభుత్వ భూముల ఆక్రమణపై కలెక్టర్ కు పిర్యాదు చేసిన జనంకోసం

అక్రమణలపై చర్యలకు కలెక్టర్ హామీ: జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి

Date : 02 March 2024 07:16 PM Views : 1038

Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణ నుంచి కాపాడాలని కోరుతూ జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు పిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని భాస్కరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూములపై 2003 నుండి సుప్రీంకోర్టు స్టెటస్కో ఆదేశాలు ఉన్నాయన్నారు. లోకాయుక్తలో సైతం ఈ భూముల అన్యాక్రాంతంపై 4666/2013/B1 విచారణ జరుగుతుందని, బై నెంబర్లపై 2023 మార్చి 9న స్పష్టమైన ఆదేశాలు జారీచేసి సంబంధిత అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందని రంగారెడ్డి కలెక్టర్ కు ఆధారాలను అందజేసినట్టు తెలిపారు.

Also Read : మాస్టర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన హోప్ ఫౌండేషన్

సర్వే నెంబర్ 66/A పేరుతో సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, జీహెచ్ఎంసీ సైతం సదరు కబ్జా భూములకు అనుమతులు మంజూరు చేయడంతో ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 100,101లలోని ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టి, రక్షించాలని హెచ్ఎండీఏ కమీషనర్ దానకిషోర్ కు, ఐఏఎస్ అమ్రపాలికి, రాజేంద్రనగర్ ఆర్డీఓ, వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని భాస్కరరెడ్డి హెచ్చరించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: