Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ హెచ్ఓ గా ఇనిస్పెక్టర్ కె.బాలరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆర్జీఐ ఎయిర్ పోర్టు ఇనిస్పెక్టర్ గా పనిచేసిన బాలరాజు బదిలీలో భాగంగా గచ్చిబౌలి ఇన్స్ పెక్టర్ గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు గచ్చిబౌలి ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన హబీబుల్లాఖాన్ సైబరాబాద్ విఆర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గురువారం బాలరాజు బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ భూవివాదంలో కేసు నమోదు చేసిన కారణంగానే హబీబుల్లాఖాన్ మీద బదిలీ వేటు పడిందనే ప్రచారం జరగడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇన్స్ పెక్టర్ బాలరాజు మాట్లాడుతూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయని, సంస్థలు, ఉద్యోగుల భద్రతకు ఉన్నతాధికారుల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్ పెక్టర్ బాలరాజుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు
Admin
Ekaburu