Wednesday, 22 April 2026 09:00:16 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

కర్ణాటక నుంచి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్

అక్కడ 86.39 కి కొని ఇక్కడ 95.65కు అమ్ముతున్న ముఠా

Date : 24 April 2024 11:50 PM Views : 939

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గతంలో మధ్య నిషేధం ఉన్నప్పుడు మందు బాటిళ్ల స్మగ్లింగ్ చూశాం... విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం చూశాం... గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుమందుల స్మగ్లింగ్ చూస్తున్నాం... కానీ కొత్తగా స్మగ్లర్ల చూపు డీజిల్ మీద పడింది. పక్క రాష్ట్రాల్లో డీజిల్ ధర తక్కువ ఉండడంతో డీజిల్ ను స్మగ్లింగ్ చేసి మన రాష్ట్రంలో అమ్ముతున్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటకలో లీటర్ డీజిల్ 86.39 రూపాయల కు దొరుకుతుండగా, తెలంగాణలో మాత్రం లీటర్ డీజిల్ ధర 95.65 ఉంది. దింతో లీటర్ మీద 10 రూపాయలు మిగులుతుండడంతో స్మగ్లర్లు డీజిల్ ట్యాంకర్లను బార్డర్ దాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో డీజిల్ స్మగ్లింగ్ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. తాజాగా గచ్చిబౌలి పోలీసులు ఓ డీజిల్ స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేసి 10,800 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు.

Also Read : గోపన్ పల్లిలో ఘనంగా కట్ట మైసమ్మ విగ్రహా ప్రతిష్టాపన

కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లను బార్డర్ దాటించి నగరానికి తీసుకువస్తున్న స్మగ్లర్లు, డీజిల్ ను చిన్న చిన్న ట్యాంకర్ల కు మార్చి డోర్ స్టెప్ డెలివరీ ఆన్లైన్ సర్వీసు ద్వారా అడిగిన వారికి, టిప్పర్లు, క్రషర్ల నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ దందాపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు దాడి చేయగా 7గురు డ్రైవర్లు, 7చిన్న ట్యాంకర్లు దొరకగా, 10,800 లీటర్ల డీజిల్ పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన 3గ్గురు ప్రధాన నిందితులు తప్పించుకున్నారు. దొరికిన డీజిల్ విలువ 10.36 లక్షలు ఉండగా, 36 లక్షల విలువైన ట్యాంకర్ల ను పోలీసులు పట్టుకున్నారు. పెద్ద ట్యాంకర్లతో కర్ణాటక నుంచి నగరానికి తెచ్చి, వట్టినాగులపల్లిలో చిన్న ట్యాంకర్ల కు మార్చి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు డీజిల్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవడం విశేషం.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :