Saturday, 18 April 2026 07:08:52 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రేవ్ పార్టీ

పట్టుబడిన ఐటీ ఉద్యోగులు, ప్రముఖులు - గంజాయి స్వాధీనం

Date : 11 September 2024 11:54 AM Views : 1059

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ లో బర్త్ డే పార్టీ ముసుగులో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఐటీ కారిడార్ నడిబొడ్డున ఈ పార్టీ బయటపడడం తీవ్ర సంచలనంగా మారింది. పార్టీలో డ్రగ్స్, గంజాయి సేవించినట్లు తెలుస్తుంది. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రముఖులు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ప్రముఖుల్లో సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బర్త్ డే పార్టీ మీద దాడి చేసిన పోలీసులు అందులో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీలో పాల్గొన్న వారి దగ్గర నుండి 40 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురుని పోలీసులు అరెస్టు చేసి నోటీసులు జారీ చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :