Wednesday, 22 April 2026 07:15:57 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

శృతిమించిన ఆర్సీబీ అభిమానుల గెలుపు సంబరాలు

గచ్చిబౌలిలో ఇద్దరు యువకులపై కేసు నమోదు

Date : 05 June 2025 07:54 AM Views : 629

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( ఆర్సీబీ ) ట్రోఫీ చేజిక్కించుకోవడంతో నగరంలో అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. కాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానుల గెలుపు సంబరాలు శృతిమించాయి. హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ చౌరస్తా వద్దకు పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. కొందరు అభిమానులు శృతి మించి చేసిన సంబరాలు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించాయి. కొండాపూర్ సిగ్నల్ వద్ద దాదాపు 150 మంది యువకులు బాణసంచా కాల్చుతూ, వాహనాలకు దారి వ్వకుండా హాల్ చల్ చేస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన రూట్ నెంబర్ 10హెచ్ బస్సు(టీజీ10టి1469) సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ క్రాస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడ బస్సు యూటర్న్ తీసుకోవాల్సి ఉండగా గెలుపు సంబరాలు చేసుకుంటున్న ఆర్సీబీ అభిమానులు రోడ్డుపై తిష్టవేసి బస్సు కు అడ్డు తగిలారు.  చాలా సేపు హరన్ కొట్టినా పక్కకు జరగని ఆర్సీబీ అభిమానులు రహదారిపై వాహనాలను ముందుకు కదలినివ్వలేదు. ఇదే సమయంలో మరింత రెచ్చిపోయిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆర్టీసీ బస్సు మీదకు ఎక్కి బస్సు ముందుకు కదలకుండా డ్రైవర్ ను అడ్డుకున్నారు..

Also Read : డ్రాగన్ కంట్రీ అగ్రికల్చర్ టెర్రరిజం

రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆంటంకం కల్గించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. బాణాసంచా కాల్చుతూ ఆర్సీబీ అభిమానులు వాహనాలకు దారి ఇవ్వకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఉన్నా వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి వచ్చింది. అర్టీసీ బస్సు ముందుకు కదలకుండా ఇద్దరు గుర్తు తెలియని యువకులు తన విధులకు ఆటంకం కల్గించారని డ్రైవర్ పోచయ్య గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :