Tuesday, 28 July 2026 05:38:39 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

అంబులెన్స్ డ్రైవర్లను చితకబాదిన ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది

హైదరాబాద్ కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ వద్ద దారుణం..

Date : 23 May 2024 11:50 AM Views : 948

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని న్యూ మల్టి కార్ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని రెచ్చిపోయాడు. తన ట్రావెల్స్ సిబ్బందితో అంబులెన్స్ డ్రైవర్ల మీద దాడి చేయించి, కర్రలతో చితకబాదాడు. హైదరాబాద్ కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ వద్ద ప్రైవేట్ ఆస్పతులకు రోగులను షిఫ్ట్ చేసే అంబులెన్స్ లు పార్కింగ్ చేసుకొని ఉంటాయి. ట్రాఫిక్ కి ఇబ్బంది కాకుండా, ఎల్బీనగర్ లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ కి అందుబాటులో ఉండే విధంగా గత కొన్నిలుగా కామినేని ఫ్లై ఓవర్ కిందే అంబులెన్స్ డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. కాగా ఫ్లై ఓవర్ కింద పార్కింగ్ చేసే అంబులెన్స్ లతో తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని న్యూ మల్టీ కార్ ఓనర్ అంబులెన్స్ డ్రైవర్ల తో గొడవకు దిగాడు. తన సిబ్బందితో కలిసి అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేయగా ట్రాఫిక్ ఎస్ఐతో గొడవ పడ్డారు. గొడవలో గాయపడ్డ వారిని  చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: